రాజకీయాల్లో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నటి వరకు మిత్రులైన వారు శత్రువులుగా మారొచ్చు. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్లు సడెన్‌గా దోస్తీ చేయొచ్చు. అధికార పార్టీకి చెందిన ఆ మంత్రి, ఎంపీలకు ఈ సూత్రం అతికినట్టు సరిపోతుంది. 2019లో కలిసి ఉన్నవారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోల్డ్‌వార్‌కు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు? మంత్రి బాలినేని.. ఎంపీ మాగుంట మధ్య కోల్డ్‌వార్ ప్రకాశం జిల్లా వైసీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య గరంగరం…