తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి…