బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. 32,106 మంది ఎడ్‌సెట్ పరీక్ష రాయగా 30,944 మంది ఉత్తీర్ణత నమోదైంది. అంటే 96.38శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొదటి మూడు స్థానాల్లో అబ్బాయిలదే హవా.