సీఎం వైఎస్ జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు.