ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి ఎలా వేడెక్కుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విటర్ వార్ మొదలైంది. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్మార్గ, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని తాను దేవుణ్ణి ప్రార్థించానన్నారు. తమని రక్షించడంతో పాటు ‘నిన్ను నువ్వు కూడా…