Love Couple Suicide: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు, యువతి ప్రేమికులను తేల్చారు. మృతులను డియోరియా నివాసి ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా గుర్తించారు.
Ayodhya Gangrape Case: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. ఇతను భద్రస నగర ఎస్పీ అధ్యక్షుడు. ఇతడితో పాటు ఇతనికి సంబంధించిన ఖాన్ బేకరీలో పనిచేసే రాజు ఖాన్ మరో నిందితుడు.