ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రపంచకప్ 2023లో ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్తోనే ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ సాధించాడు. ట్రావిస్ కేవలం 59 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా అతని దూకుడు ఇన్నింగ్స్ తో తన పేరును ప్రత్యేక జాబితాలో నమోదు చేసుకున్నాడు.