ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు ఇప్పటికే కంగారో గడ్డకు చేరుకుంది. టీమిండియా ప్లేయర్స్ సాధన కూడా మొదలెట్టేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. రోహిత్ సతీమణి రితిక రెండో కాన్పు నేపథ్యంలో భారత్‌లోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్ ఆసీస్ వెళ్లేదెప్పుడో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా కూడా హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆపలేదు. రోహిత్ ముంబైలో బ్యాటింగ్…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలకు గురవుతున్నాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరుచుకుపడగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‌కు ముందు అపహాస్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నాడు.…
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు రెండు బృందాలుగా ఆస్ట్రేలియా చేరుకుంది. బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనే దిశగా రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలెట్టింది. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. తొలి శిక్షణ శిబిరంలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ తదితరలు బ్యాటింగ్ సాధన చేశారు. హిట్టర్లు పంత్, జైస్వాల్ భారీ షాట్లు ఆడారు. జైస్వాల్ కొట్టిన ఓ బంతి స్టేడియం పక్కనే ఉన్న రహదారిపై పడింది.…
భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 13 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇటీవల భారత్-ఎతో అనధికార టెస్టులో ఓపెనర్‌గా రాణించిన నాథన్ మెక్‌స్వీనీ టీమిండియాపై అరంగేట్రం చేయనున్నాడు. మెక్‌స్వీనీ భారత్-ఏపై రెండు ఇన్నింగ్స్‌ల్లో 39, 88 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్…