ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ జ్ఞాపకాలను స్మరించుకుంటోంది. భారత క్రికెట్‌లో కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇండియాలో సూపర్ డూపర్ హిట్ లీగ్ ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడింది షేర్ వార్న్ జట్టే కావడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన వార్న్ ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. తొలి…