మేషం : వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం కోసం యత్నాలు సాగిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. వృషభం : వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది.…