పంజాబ్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవిని వేలం వేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గురుదాస్‌పూర్‌లోని హర్దోవల్ కలాన్ గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం రూ. 50 లక్షలకు వేలం ప్రారంభం కాగా, స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మా సింగ్ రూ. 2 కోట్లకు వేలంలో సర్పంచ్ సీటును సొంతం చేసుకున్నాడు.