Atul Subhash Suicide Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులను 24 పేజీల్లో వివరించాడు. చనిపోయే ముందు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అందులో తన ఆవేదన, తాను ఎదుర్కొన్న తప్పుడు కేసులను గురించి చెప్పాడు
Atul Subhash Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుభాష్ ఆత్మహత్యకు కారణమైన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం బెంగళూర్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తమ బెయిల్ పిటిషన్‌ని పరిష్కరించేలా సెషన్ కోర్టుని ఆశ్రయించాలని వీరు గతంలో కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు.
Section 498A: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యతో పాటు ఆమె కుటుంబం వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నారు. తాను నిర్దోషినని అయినా కూడా న్యాయవ్యవస్థ ఆమెకే అనుకూలంగా ఉందని చెబుతూ 20 పేజీల లేఖ రాయడంతో పాటు 80 నిమిషాల వీడియోలో తాను అనుభవించిన వేధింపులను చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అయింది.