Donald Trump: ఖలిస్తాన్ ఉగ్రవాది, అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ డామియన్ విలియమ్స్‌ని కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఇతడి స్థానంలో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిక్ట్ అటార్నీగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) మాజీ ఛైర్మన్ జే క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు.
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
ప్రభుత్వ అత్యున్నత న్యాయవాది అయిన భారత అటార్నీ జనరల్‌గా తిరిగి రావాలని కేంద్రం చేసిన ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం చెప్పారు.