హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. కాగా.. ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వారిని చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు ఆగంతకులు.