Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన జరిగింది. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు, ఆమెపై చిత్రహింసలకు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ మరణించింది. ఖాండ్వాలో ఖల్వా పరిధిలోని రోష్నీ చౌకీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ దారుణమైన అత్యాచారం, హత్య జరిగింది.