ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన బ్యాగరి నర్సింహులు(41) పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. అయితే దర్శకుడు దాసరి నారాయణరావు వద్ద 2012 నుంచి 2016 దాకా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశాడు. దాసరి మృతి తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనులను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పూర్తి చేశాడు.…