దొంగను పట్టుకున్న పోలీసే దొంగ అయితే ఎలా వుంటుంది. హాస్యాస్పదంగా వుంటుంది కదూ.. ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుందటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే.. చోరీ కేసులో పట్టు పడ్డ ఖాతాలో నుంచి ఓ.. పోలీసు బాసు డబ్బులు కాజేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చోరీ కేసులో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. ఏకంగా అరెస్టై జైలులో ఉన్న నిందితుడి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశాడు ప్రబుద్ధుడు.…
దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. మొన్న దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. అది మరచిపోకముందే ఏటీఎం లో చోరీకి విఫలయత్నం చేశారు. అలారం మ్రోగడం తో పరారయ్యారు దుండగులు.కాటేదాన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎం లోకి చొరబడ్డారు కొంతమంది దుండగులు. తమతో తెచ్చుకున్న రాడ్ తో ఏటీఎం డోర్ ధ్వంసం చేశారు దుండగులు. డోర్ తెరచుకోవడంతో వెంటనే అలారం మోగింది. దీంతో వెంటనే అలర్ట్…