పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. వివిధ క్రీడలకు చెందిన 10 వేల మందికి పైగా అథ్లెట్లు పారిస్‌లో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. భారత్‌లోని ప్రతి క్రీడాకారుడు దేశానికి గర్వకారణం.. వారందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాసుకొచ్చారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా మొత్తం ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు కాంస్యం, రెండు రజతం, ఒక గోల్డ్ పతకం ఉన్నది. అయితే, కొన్ని విభాగాల్లో ఇండియా అద్భుతమైన ప్రతిభను కనబరిచినా, చివరి నిమిషంలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. విమెన్ హాకీ టీమ్ ఆద్యంతం అద్భుతమైన ఆటను ప్రదర్శించినా చివరకు కాస్యం చేజార్చుకుంది. కానీ, ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపికా పూనియా తదితరులు తృతిటో కాంస్యం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.…
టోక్యో ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కలకలం రేపింది. నేడు నిర్వహించిన కరోనా పరీక్షలో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఒలంపిక్స్ విలేజ్ లో నిన్న తొలి కరోనా కేసు నమోదు కావడంతో ఈరోజు అక్కడ అందరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఇద్దరికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇక ఒలంపిక్స్ విలేజ్ లో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రతిరోజు క్రీడాకారులకు…
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా,…