భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ విక్రయాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటిందని కంపెనీ ప్రకటించింది. మే 2025లో 1,00,000 రిజ్తా యూనిట్లను ఏథర్ విక్రయించగా.. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 2,00,000కు చేరింది. స్కూటర్ లాంచ్ అయిన 20 నెలల్లోనే కంపెనీ ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇది ఒక గొప్ప విజయం అని కంపెనీ పేర్కొంది.…