World Cup 2023: అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఏ నోట చూసినా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ గురించే వినబడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తం క్రికెట్ ఫ్యాన్స్ పలు కార్యక్రమాలను ప్రారంభించారు. తిరంగాలతో సంబరాలు చేసుకుంటున్నారు.