మేషం: ఈ రోజు ఈ రాశివారు వృత్తి వ్యాపారాల కోసం ధనం అధికంగా ఖర్చుచేయాల్సి వస్తుంది.. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను ఎదుర్కొంటారు. ఉద్యోగ భద్రత వల్ల భవిష్యత్తు పట్ల భరోసా వస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించు కుంటారు. వృషభం : ఈ రోజు మీరు బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీముల పట్ల అవగాహన అవసరం.…