అసెంబ్లీ ఎపిసోడ్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మరోసారి స్పందించారు. అసెంబ్లీ అనేది చట్టాలు చేసే పవిత్రమైన స్థలమని… అసెంబ్లీలో భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలంతా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. సభ లో భిన్నమైన వాతావరణం ఉంది.. ప్రజా సమస్యలపై కాకుండా వేరే రకమైన చర్చ జరుగుతోంది.. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని… విభజన చట్డంలోని 90 శాతం అంశాలు పూర్తయ్యాయని…
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అట్టడుగుపోతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలపై నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి తమదైన రీతిలో స్పందించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. ” అందరికి నమస్కారం.. మాట మన వ్యక్తిత్వానికి సమానం.. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం.. అయితే…