ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా ఒక్కోక్కరు ఏదో ఓ కారణం చేత, అనారోగ్యంతో కన్నుముస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. ఇది నిజంగా ఓ చేదు వార్త. గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె అకాల మరణం పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.. ‘ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు’ అని…