Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా తెలియజేశారు.