బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అస్సాంలోని బొంగైగావ్ జిల్లాలో ఒక ప్రైవేట్ మదర్సాను బుధవారం కూల్చివేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆగస్టు నెలలో కూల్చివేయబడిన మూడో ప్రైవేట్ మదర్సా ఇది. మదర్సా ఉపాధ్యాయుడు హఫీజుర్ రెహమాన్‌ను ఆగస్టు 26న అరెస్టు చేసిన కొద్ది రోజులకే మళ్లీ మదర్సాను కూల్చివేశారు. ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆగస్టు 21న సమీపంలో ఉన్న గోల్‌పరా జిల్లాలో పట్టుబడిన ఇద్దరు…