ఏపీ రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ది, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రూపాయల మేర రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ విశేషాలను సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై వారితో చర్చలు జరిపినట్టు సీఎం ట్వీట్ చేశారు.
Business Headlines: టాటా గ్రూప్ సంస్థలు 60 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్నాయి. ఈ మేరకు ప్రధాన బ్యాంకులతోపాటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాయి.