India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు.
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దాయాది పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భాగంగా నవంబర్ 14న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ ఆసియా కప్ 2025’, ‘బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్’ అని ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనలకు లోబడి మ్యాచ్ ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసింది. బాయ్‌కాట్ ట్రెండ్ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌కు…