క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు మరో టోర్నీ సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియాకప్ మనముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి ఏసీసీ(ఏసియన్ క్రికెట్ కౌన్సిల్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది.