ఇవాళ ఉదయం రామతీర్థం వద్ద జరిగిన సంఘటనపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారమే అశోక్ గజపతిరాజును ఆహ్వానించామని.. శిలా ఫలకంపై పేర్లు వేసే పద్ధతి గత ప్రభుత్వంలో చేయలేదని గుర్తు చేశారు. అధికారులు మర్యాదలు చేయబోతుంటే ఆయనే అడ్డుకున్నారని మండిపడ్డారు. అశోక గజపతి రాజుకు రాజకీయ మనుగడ లేకే.. ఇలాంటి రాజకీయాలకు పాల్ప డుతున్నారని ఆగ్రహించారు. దేవుళ్ళ మీద రాజకీయం చేసే వారిని శ్రీరాముడు శిక్షిస్తాడని… చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో జరిగిన భూకబ్జాలను తిరిగి…