గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగీతో బాధపడుతూ అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం నాడు కన్నుమూశారు. గతంలో ఆశాబెన్ పటేల్ కరోనా బారిన కూడా పడ్డారు. ఇప్పుడు డెంగీ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయారు. ఆమె మరణ వార్తను జైడస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. గతంలో ఆరు సార్లు బీజేపీ తరపున ఉంఝా స్థానం నుంచి…