గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలగితే దర్యాప్తులో చిక్కుకున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను విడిచిపెడతామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోని అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.