ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం ‘ఎంగ చిన్న రాస’ సినిమా హిందీలో ‘బేటా’గా రూపొంది అనూహ్య విజయం సాధించింది. భాగ్యరాజా నటించిన చిత్రం…