ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్నారు..
మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఆయన ఉసిరి మొక్కను నాటారు. ఈ సందర్భంగాచెట్ల యొక్క ఔన్నత్యాన్ని…