Canada: ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లాని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో దేశంలో జరిగిన కాల్పులకు సంబంధించి అర్ష్ దల్లాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కెనడాలో హత్య చేయబడిని ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి హర్ష్ దల్లా అత్యంత సన్నిహితుడు. భారత్ ఇతడిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.