సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.