Kolkata Doctor Case: కోల్‌కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన లేడీ డాక్టర్ రేప్-మర్డర్ కేసును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మమత ప్రభుత్వం హామీ ఇచ్చిన తమ డిమాండ్లను నెరవేర్చలేదని వారు ఆరోపించారు. శుక్రవారం ధర్మతలలోని డోరినా క్రాసింగ్ వద్ద వైద్యులు నిరసన చేపట్టారు. హామీ మేరకు తన డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు విధించారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న జూనియర్ డాక్టర్…