ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శితమవడమే గొప్ప విషయంగా మారింది. పెద్ద హీరోల చిత్రాలు సైతం వారాంతం వరకే సందడి చేసి, ఆ తర్వాత నెమ్మదిస్తున్నాయి. సినిమాకు బలమైన పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప, రెండో వారం ఆడటం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో, గత వారం విడుదలైన ‘అరి’ చిత్రం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి నుంచీ మంచి…