భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఈ దేశంలోని పౌరులందరినీ ఒక్కటిగా కలిపి ఉంచాలని మహనీయులు కలలు కని రూపొందించిన రాజ్యాంగం మనది. కానీ ఏడు దశాబ్దాలు గడిచినా ఈ దేశంలో కులాల మధ్య చిచ్చు రావణకాష్టంలా రగులుతూనే ఉంది. దీనికి కారణం ఏమిటి? రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయని రాజకీయ నాయకులదా? కులోన్మాదాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్న కుల సంఘాల నేతలదా? అటు అధికారపీఠంపై ఉన్న నేతలలోనూ, ఇటు కులోన్మాదులలోనూ…