అర్చనా నాగ్.. ఎంతో మంది వీవీఐపీలకు వలపు వల విసిరిన కిలేడీ. ఆమె స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సినిమా స్టార్లు ఇలా ఎంతో మంది ప్రముఖులను తన వలలో వేసుకుని అందంతో ఒక ఆట ఆడించింది. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన హనీట్రాప్.. ఒడిశాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్‌కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశంతో అర్చనా నాగ్ జైలుకు కూడా వెళ్లొచ్చింది.