అంతరిక్షంలో మరో చారిత్రక అడుగు వేయడానికి యూఏఈ సిద్ధమైంది. అరబ్ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి ఏప్రిల్ 28న మొదటి అంతరిక్ష నడకకు(స్పేస్ వాక్) చేపట్టిన మొదటి అరబ్ వ్యోమగామిగా రికార్డు సృష్టించనున్నాడు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురువారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.