భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ హైదరాబాద్‌లో మరోసారి తన మ్యూజిక్ మేజిక్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికలపై లైవ్ కచేరీలతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన రెహమాన్, ఈసారి హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక మ్యూజిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీ లో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ విషయాన్ని బుధవారం హైదరాబాద్ టాకీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ…