ఎ.ఆర్.రహమాన్ స్వరవిన్యాసాలకు అభిమానులు కానివారు ఎవరుంటారు? మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'లోనూ కొన్ని పాటలతో ఆకట్టుకున్నారు రహమాన్. ఆయన మాయాజాలం ఇంకా పనిచేస్తూనే ఉందని చెప్పవచ్చు. ఆయన తెలుగువారు కాకపోయినా, ఆయనంటే మన తెలుగువారికి ఎంతో అభిమానం. అలాగే రహమాన్ తల్లి కస్తూరి జన్మస్థలం మన తెలుగునేలలోని హైదరాబాద్.
‘ది మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ అని మ్యూజిక్ ప్రియులు లవర్స్ పిలుచుకునే దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి నేటితో 55 ఏళ్లు. ఆయన తన మనోహరమైన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించారు. భారత ప్రభుత్వం ఆయన చిత్రపరిశ్రమకు చేసిన కృషికి గానూ దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందించి గౌరవించింది. రెహమాన్ అందుకున్న అవార్డులలో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు అకాడమీ అవార్డులు, రెండు గ్రామీ అవార్డులు, ఒక…