ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లకు 30 శాతం నుంచి 50 శాతం వరకు జీతాలు పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (జనరల్), డీఏఎస్ లకు 30 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.…