కరోనాపై పోరులో భారత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. దేశంలో వంద కోట్ల టీకాల మైలురాయిని దాటేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. అవకాశాలను, వనరులను వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 5.01 కోట్ల డోసుల టీకాలను ఇచ్చారు. సోమవారానికి అది మరింత పెరగనుంది. ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది ప్రజలకు రెండు డోసులు టీకాలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉంది. తాజాగా ఐదు కోట్ల డోసులు పూర్తయ్యాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే మిగతా పెద్ద…