ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తిగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి రక్షిణ కల్పించాలంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి అతనికి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అతనిపై తప్పులు కేసులు బనాయిస్తున్నారని, చివరికి సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు.…