ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాల కోసం ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా 65,456 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2లక్షలు ఉండగా.. ఈ మొత్తం దరఖాస్తులతో రూ.13.91 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా,…