యాపిల్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ జారీ చేసింది. కంపెనీకి చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు ఉపయోగించేవారిని కేంద్రం అలర్ట్ చేసింది. యాపిల్ డివైజ్‌ల్లో పాత సాఫ్ట్‌వేర్‌లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Apple: ఇటీవల ప్రతిపక్ష నేతలకు ఆపిల్ ఐఫోన్లు హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అలర్ట్ మేసేజ్ రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రతిపక్ష నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్లకు నోటిఫికేషన్లు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ ప్యానెల్ ఆపిల్ ఇండియా అధికారులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.
Tata To Make iPhones: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా కొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 115 ఏళ్ల టాటా సంస్థ ఉప్పు నుంచి టెక్నాలజీ దాకా ఎన్నో రంగాల్లో ఉంది. ఇకపై టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. టాటా గ్రూప్ రెండున్నరేళ్లలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారతదేశంలో ఆపిల్ ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ రోజు ప్రకటించారు. ఇది భారతదేశ ఉత్పత్తి…