మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అప్పిరెడ్డి ఫౌండేషన్, సోహిహెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలు శనివారం హైదరాబాద్ నగరంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాయి. అప్పిరెడ్డి ఫౌండేషన్ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డితోపాటు, సోహి హెల్పింగ్ హ్యాండ్స్, మైక్ మూవీస్, మైక్ టీవీ సంస్థల ప్రతినిధులు చక్రధర్ రావు, రవి రెడ్డి, చరిత్, సంపత్, జగ్గూ పాల్గొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను సందర్శించి అక్కడివారికి అన్నదానంతోపాటు పళ్లు ఫలహారాలు అందించారు. చిరంజీవి చిరకాలం ఆయురోరాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.…