నిత్యం భక్త జన నీరాజనాలు అందుకుంటున్న వైనతేయ నది తీరాన అప్పనపల్లిలో కొలువైవున్న శ్రీబాలబాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణలతో వేద పండితులు, అర్చకస్వాములు , దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య తిరు కల్యాణానికి శ్రీకారం చుట్టారు . కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై వున్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది . స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని…