అబ్బబ్బ.. ఏం స్కెచ్చేశారు. చిన్న యాప్ పెట్టారు.. ఏకంగా 4 వేల కోట్ల రూపాయలు కొట్టేశారు. ప్రపంచంలో ఎవరూ పెట్టని విధంగా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టారు. తీరా బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తట్టా బుట్టా సర్దేసి విదేశాలకు చెక్కేశారు. కానీ దాదాపు 4 నెలల తర్వాత పోలీసులు ఫాల్కన్ నిందితుల్లో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున జనాలకు కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి…